![]() |
![]() |
.webp)
మొదట సీరియల్ నటుడుగా మెప్పించిన అలీ రెజా తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అలరించాడు. అలీ రెజా విన్నర్ గా రేస్‌లోకి వచ్చాడు. కానీ ఎలిమినేట్ ఐపోయాడు. ఆ తరువాత వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. విన్నర్ రేస్‌లో నిలవలేకపోయాడు. అలాంటి అలీ రెజా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు..రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసాడు. అదేంటంటే తన ఇంటి పెరట్లో ముద్దుల కూతురు అమైరాతో కలిసి మామిడి మొక్క, అరటి చెట్టును పాతాడు. తన కూతురి చేత మొక్కలకు మట్టి వేయించి నీళ్లు కూడా పోయించాడు. అలాగే తన పెరట్లో ఉన్న జామకాయ చెట్టు నుంచి దోరగా పండిన జామకాయ తీసుకుని తిన్నాడు.
ఈ వీడియోని పోస్ట్ చేసి "నా కూతురి కోసం ఒక మొక్క, రెండు కలిసి స్ట్రాంగ్ గా పెరుగుతూ" అని పోస్ట్ చేసాడు. ఇక తన కూతురికి కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఆ మొక్కలతో పాటు నువ్వు కూడా స్ట్రాంగ్ గా పెరుగుతావు అన్నాడు. ఇక నెటిజన్స్ ఈ వీడియోని చూసి ఫుల్ ఖుషి ఐపోతున్నారు. అలీ రెజా బిగ్ బాస్ సీజన్ 3కి వెళ్లి వచ్చిన తర్వాత నాకు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ చిత్రం అలీకి ఆశించినంతగా పేరు తీసుకురాలేకపోయింది. అదే టైంలో అలీ రెజాను ఇండస్ట్రీలో కొంత కాలం బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆలీ రెజా మీద బ్యాన్ ని ఎత్తేయడంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. వెబ్ సిరీస్ లు, మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |